సిద్దార్థ్ కి ఎన్ని కష్టాలో...
on Jul 3, 2025
.webp)
కూకు విత్ జాతిరత్నాలు షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి గెస్ట్ గా సిద్దార్థ్ వచ్చాడు. ఇక రాగానే "అదిరే అదిరే" సాంగ్ ని ప్లే చేయడంతో సిద్దార్థ్ కూడా మంచి జోష్ తో డాన్స్ చేసాడు. తర్వాత హోస్ట్ ప్రదీప్ అడిగాడు "మీకు వంటొచ్చు కదా" అని. "నేను రెగ్యులర్ కుక్ ని ఇక ఇప్పుడు పెళ్లయింది కదా ఇంకా రెగ్యులర్ కుక్ ని ఐపోయాను" అని చెప్పాడు సిద్దార్థ్. దాంతో అందరూ నవ్వేశారు. వెంటనే రాధ "సిద్దార్థ్ నేను అదితిది ఒక వీడియో చూసాను. మూన్ మూన్ మూన్ కా కట్ చేసి అంటూ భలే క్యూట్ గా చెప్తోంది కదా" అని అంది. దానికి సిద్ధార్థ్ " ఉల్లిపాయ కట్ చేసేటప్పుడు మీరు మూన్ మూన్ మూన్ షేప్ లా కట్ చేయాలి అని చెప్తుంది. ఏంటా షేప్ అంటే ఉల్లిపాయ కట్ చేసినప్పుడు ఆ షేప్ మూన్ లా ఉండాలట" అని చెప్పాడు. దానికి ప్రదీప్ "ఇంకా నయం ఆ రోజు అమావాస్య ఐతే ఎం కట్ చేయాలో తెలీదు" అని కామెడీ డైలాగ్ వేసేసరికి అందరూ నవ్వేశారు.
తర్వాత జాతిరత్నాలుకి ఐరన్ బాక్స్ మీద ఆమ్లెట్ వేసే టాస్క్ ఇచ్చారు. కానీ ఆర్జే హేమంత్ మాత్రం గుడ్డు కొట్టి ఐరన్ బాక్స్ మీద వేయబోయాడు కానీ అది కాస్త కింద పడిపోయింది. దాంతో సిద్దార్థ్ "టైటిల్ లో ఒక నిజం ఉంది నిజాయితీ ఉంది. జాతిరత్నాలు అందరూ జాతిరత్నాలే" అంటూ అందరినీ చూస్తూ సెటైర్ వేసాడు. సిద్ధార్థ్ నటించిన 3 bhk మూవీ ప్రొమోషన్స్ కోసం వచ్చారు. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ మూవీ జులై 4 న రిలీజ్ కాబోతోంది. ఇదొక మిడిల్ క్లాస్ ఎమోషనల్ స్టోరీ. ఇందులో సొంత ఇంటి కలను సాకారం చేసుకున్నారా లేదా అన్నదే స్టోరీ లైన్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



